గత మూడేళ్లుగా టీమిండియాను ప్రధానంగా వేధిస్తున్న సమస్య మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్. మ్యాచ్ విన్నర్లుగా భావించే కీలక స్థానాల్లో సరైన బ్యాట్స్‌మన్ లేక తీవ్ర ఇబ్బంది పడుతోంది భారత జట్టు. కొన్ని సందర్భాల్లో టాప్‌ఆర్డర్ విఫలమైతే ఇక జట్టును ఆదుకునే ఆటగాడే కరువయ్యాడు. ఈ నేపథ్యంలోనే భారత్.. ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా నాలుగో స్థానంలో నిలకడైన ఆటగాడు లేక పలుసార్లు ఓటమి చవిచూసింది. కాగా ఈ స్థానంలో సరైన ఆటగాడి కోసం టీమిండియా అనేక మందిని పరీక్షించినా ఏ ఒక్కరూ రాణించలేకపోయారు. అంబటి రాయుడు, అజింక్య రహానె, కేదార్ జాదవ్, దినేశ్ కార్తిక్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, మనీశ్ పాండే, రిషభ్ పంత్.. ఇలా ఎంత మందికి అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆ స్థానంలో మెరుస్తున్నాడు శ్రేయస్ అయ్యర్.
నాలుగులో శ్రేయస్కరమైన ఆటగాడా?